Sunday, December 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరెండో విడతకు భారీ బందోబస్తు

రెండో విడతకు భారీ బందోబస్తు

- Advertisement -

50వేల మందికి పైగా పోలీసులతో పహారా : డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ఆదివారం జరిగే రెండో విడత పోలింగ్‌కు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 53వేల మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసినట్టు రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి శనివారం తెలిపారు. 3911 సర్పంచ్‌లు, 29,917 వార్డు సభ్యుల ఎన్నిక కోసం జరుగుతున్న పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని విధాల చర్యలు తీసుకున్నట్టు ఆయన చెప్పారు.

ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలను అడ్డుకొని వారి నుంచి రూ.8.50 లక్షల విలువైన నగదుతో పాటు ఇతర వస్తువులను స్వాధీనపర్చుకున్నామని తెలిపారు. ఎన్నికలకు అవాంతరాలు కలిగిస్తారని అనుమానించిన 33వేల మందిని బైండోవర్‌ చేశామనీ, లైసెన్స్‌లను కలిగి ఉన్నవారి ఆయుధాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌లలో డిపాజిట్‌ చేయించటం జరిగిందని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ను రంగంలోకి దించామన్నారు. పోలింగ్‌ అనంతరం జరిగే కౌంటింగ్‌ పర్వానికి సైతం ఎన్నికల నియమాల ప్రకారం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -