Monday, November 10, 2025
E-PAPER
Homeజాతీయంభారీ ఉగ్ర కుట్ర

భారీ ఉగ్ర కుట్ర

- Advertisement -

హైదరాబాద్‌ వ్యక్తి సహా ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్‌
ఏడాదిగా గుజరాత్‌ ఏటీఎస్‌ నిఘా


న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్న ముగ్గురు ఉగ్రవాదులను అహ్మదాబాద్‌లో గుజరాత్‌ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌) అరెస్టు చేసింది. గత ఏడాది నుంచి నిందితులపై నిఘా పెట్టిన గుజరాత్‌ ఏటీఎస్‌, ఆయుధాలు సరఫరా చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు వీరు ప్రణాళిక చేస్తున్నట్టు గుర్తించింది. నిందితుల వద్ద నుంచి రెండు గ్లోక్‌ పిస్టల్స్‌, ఒక బెరెట్టా పిస్టల్‌, 30 బుల్లెట్లు, 4 లీటర్ల ఆముదం నూనెను స్వాధీనం చేసుకుంది.

నిందితుల్లో ఒకడైన అహ్మద్‌ మొహియుద్దీన్‌ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని గుజరాత్‌ డీఐజీ సునిల్‌ జోషి తెలిపారు. మరో ఇద్దరు నిందితులు ఆజాద్‌ సులేమాన్‌ షేక్‌, మొహమ్మద్‌ సుహెల్‌ సలీంఖాన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారని పేర్కొన్నారు. అహ్మద్‌ మొహియుద్దీన్‌ ఇప్పటికే పలు ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొన్నాడని తెలిపారు. అహ్మదాబాద్‌కు అతడు వస్తున్నట్టు సమాచారం అందడంతో నిఘా పెట్టారు. అదాలజ్‌ టోల్‌ ప్లాజా సమీపంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -