Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మాస్టర్ ఒరేటర్ 

నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మాస్టర్ ఒరేటర్ 

- Advertisement -

నవతెలంగాణ – నకిరేకల్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని శిరిడి సాయి కళ్యాణ మండపంలో ఈ చాంప్స్ విద్యార్థులకు మాస్టర్ ఒరేటర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ సిఐ ఎన్. వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో వాక్చాతుర్యంతో పాటు సామాజిక అంశాల మీద అవగాహన కల్పించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డి.జి.యం. రమణారెడ్డి, నల్లగొండ జోన్ ఏ.జి.యం. శ్రీనివాసరెడ్డి, సూర్యాపేట జోన్ ఏ.జి.యం. రమేష్ రెడ్డి, ఈ చాంప్స్ ఆర్.యన్.డి స్వాతి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సాఫ్ట్ స్కీల్స్ టీమ్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -