నవతెలంగాణ – కామారెడ్డి
బిబిపేట మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం బీబీపేట మండల కేంద్రంలో మండల సర్పంచ్ల సమావేశము నిర్వహించి ఆ సమావేశంలో ఎన్నికలను నిర్వహించారు. ఈయొక్క సమావేశంలో మండల సర్పంచ్లల అధ్యక్షుని గురించి చర్చించి వివాదాలకు దూరంగా ఉండే జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాసులు ఈ యొక్క సమావేశంలో అధ్యక్షునిగా, కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బిబిపేట మండలం సర్పంచులు తెలిపారు.
ఉపాధ్యక్షులుగా ఇస్సార్ నగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ ధర్మగారి రాజ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బీబీపేట గ్రామ సర్పంచ్ ఏదుల సాత్విక, కోశాధికారిగా కోనాపూర్ సర్పంచ్ చెప్వాల రాజేష్, సలహాదారులుగా సేరి బీబీపేట్ సర్పంచ్ గౌటి దేవయ్య, యాడారం సర్పంచ్ గొబ్బూరి సుధారాణి, మాందాపూర్ సర్పంచ్ ఆకుల హరీష్,, మల్కాపూర్ సర్పంచ్ రామగల్ల నాగరాజు, శివార్ రాంరెడ్డిపల్లి సర్పంచ్ ధర్మ లక్ష్మి శ్రీనివాస్, తుజాల్పూర్ సర్పంచ్ తలారి వనిత శ్రీనివాస్ తదితరులను ఎన్నుకున్నారు.



