నవతెలంగాణ-హైదారాబాద్: వ్యోమగామి శుభాంశు శుక్లా రేపు భారత్‌కు రానున్నారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు వెళ్లారు. రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. భారత్‌కు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక సోమవారం మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుభాంశు శుక్లా పాల్గొంటారని వెల్లడించాయి.
జూన్ 25న చేపట్టిన యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైన విషయం తెలిసిందే. రోదసిలో 18 రోజులు గడిపారు. శుభాంశు శుక్లా బృందం జులై 15న భూమికి తిరిగి వచ్చింది. వచ్చిన వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.