యూత్ కాంగ్రెస్ నాయకులు మర్రి నరేష్
గ్రామాల్లో విస్తృత పర్యటన
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా కేంద్రంలో డిఎల్ఆర్ ఫంక్షన్ లో రేపు శుక్రవారం జరుగు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి “ధనసరి సూర్య” పుట్టినరోజు వేడుకలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని యూత్ నాయకులు మర్రి నరేష్ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ధనసరి సూర్య పుట్టినరోజు వేడుకలకు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, గ్రంథాలయ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ రేగ కళ్యాణి, ప్రముఖులు, ప్రముఖ పార్టీ శ్రేణులు హాజరవుతున్నారని అన్నారు.
ఈ పుట్టినరోజు వేడుకలు భారీ సంఖ్యలో హాజరై ఘనంగా అంబరానంటే సంబరాలు జరుపుకోవాలని కోరారు. కావున ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా సోదరీమణులు, మేధావులు, అభిమానులు అందరూ హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
దనుసరి సూర్య జన్మదిన వేడుకలు విజయవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES