- Advertisement -
సీపీఐఎంఎల్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్
నవతెలంగాణ – మల్హర్ రావు(మహముత్తారం)
భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలం మాదారం గ్రామంలో ఆదివాసి గిరిజన జిల్లా నాయకుడు దయ్యం పోచయ్య తల్లి దయ్యం మానుతమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగిందని తెలుసుకొని శనివారం బాధిత కుటుంబాన్ని పరమార్షించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించినట్లుగా సీపీఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా మృతురాలి ఆత్మ శాంతి చేకూర్చాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో యువైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అక్కల బాబు యాదవ్, ఆదివాసి నాయకులు గొట్టం ఎల్లయ్య, గుంటి లక్ష్మి,గుంటిరామయ్య, లాస్య, దెయ్యం బక్కయ్య, రాజేష్ పాల్గొన్నారు.
- Advertisement -