Monday, July 14, 2025
E-PAPER
Homeదర్వాజఓ ప్రపంచ పావురమా వర్ధిల్లాలి

ఓ ప్రపంచ పావురమా వర్ధిల్లాలి

- Advertisement -

ఓ ప్రపంచ పావురమా వర్ధిల్లాలి
జర కళ్ళు తెరిచి చూడాలి
ఒకడేమో ఈ భూమి నాదంటడు
పిల్లలు, వద్దులు, అసహాయులపై
మిసైళ్లను వదులుతుంటడు
ఇంకొకడేమో నా మతమే గొప్పదని
బుల్లెట్లు కురిపిస్తుంటడు
తనదే జాతని తానే మనిషినని
మనుషుల్ని మనుషులుగా చూడని వాడు
ముఖాల మీద విసర్జిస్తుంటడు
ఆదిపత్య రాజకీయ చదరంగంలో ప్రాణాలే సమిధలు
ఎవరికీ దక్కని మానవీయ బంధాలు
ఈ సామ్రాజ్యం తనదేనని భావిస్తూ
అధికార హుకుం జారీ చేస్తడు
ప్రచ్చన్న యుద్ధం ప్రత్యక్షం అవుతుంది
పన్నుల యుద్దంవ్యాపార యుద్ధమైంది
పేదవాడి జీవితం గిలిగిలాడుతుంటే
ఆనందపడే పెట్టుబడి శాడిస్టుల మధ్య
ప్రపంచ శాంతి బందీ అయింది
రండి అమన్‌ చమన్‌ కొరకు నినదిద్దాం
శాంతి పావురాలు మళ్ళీ ఎగిరేద్దాం
– వహీద్‌ ఖాన్‌, 9441946909

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -