నవతెలంగాణ- సిటీబ్యూరో
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ జిల్లాస్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)ని ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఏర్పడిన ఈ కమిటీ ఎన్నికల సమయంలో ప్రచార మాధ్యమాల్లో ప్రచురితమయ్యే వార్తలు, ప్రకటనలు, చెల్లింపు వార్తలపై పర్యవేక్షణ చేయనుంది. జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఈ కమిటీకి చైర్మెన్‌గా, జీహెచ్‌ఎంసీ ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం మెంబర్ సెక్రెటరీగా వ్యవహరించనున్నారు.
సికింద్రాబాద్ ఆర్డీఓ, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి.సాయి రామ్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ ఇంజనీర్ (ఐటీ వింగ్ అండ్ సోషల్ మీడియా) నర్సింగ్‌రావు, హైదరాబాద్ పీఐబీ డిప్యూటీ డైరెక్టర్ మనసా కృష్ణకాంత్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డైలీ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ బచంజీత్ సింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, మీడియా సమన్వయం కోసం ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలకు ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES