Sunday, December 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఎండీఎంఎస్‌ ఫలితాలపై విచారణ జరపాలి

ఎండీఎంఎస్‌ ఫలితాలపై విచారణ జరపాలి

- Advertisement -

రీవాల్యుయేషన్‌ తప్పనిసరి చేయాలి
పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ వైద్యుల ఆందోళన


నవతెలంగాణ – ముషీరాబాద్‌
ఎండీఎంఎస్‌ ఫలితాలలో వచ్చిన అసమానతలపై సమగ్ర విచారణ జరపాలని, తమ భవిష్యత్‌ను ప్రభావితం చేయకుండా రీవాల్యుయేషన్‌ తప్పనిసరి చేయాలని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ వైద్యులు డిమాండ్‌ చేశారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ప్రకటించిన ఎండీఎంఎస్‌ పరీక్ష ఫలితాలలో అక్రమాలు అసమానతలు ఉన్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు చెందిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యులు శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద నిరసన తెలిపి.. విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యులు వెంకటేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ వైద్యుల పరీక్షల్లో ఉత్తమ సమాధానాలు అందించినా అక్రమాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

సిలబస్‌కు సంబంధంలేని బౌన్సర్‌ ప్రశ్నలు రావడం, ఒక్కసారి మాత్రమే రీవాల్యుయేషన్‌ జరగడం వల్ల పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వైద్యులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. పరీక్ష పత్రాలు అనుభవం లేని ప్రొఫెసర్ల చేత దిద్దించారని అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ.. పరీక్ష విధానంలో తీవ్ర అస్పష్టతలు ఉన్నాయని, ఒక్కో పేపర్‌కు 40 మార్కుల పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ, పాస్‌ మార్కులు, అగ్రిగేషన్‌ లెక్కల్లో పెద్ద తప్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. రెండుసార్లు రీవాల్యువేషన్‌ చేయడం ఎన్‌ఎంసీ మార్గదర్శకాల్లో ఉండగా, ఒక్కసారి మాత్రమే పేపర్లు పరిశీలించారని తెలిపారు. ఫలితాలలో వచ్చిన ఈ అసమానతలు తమ భవిష్యత్‌ను ప్రభావితం చేస్తున్నాయన్నారు. అందుకే రీవ్యాల్యువేషన్‌ తప్పనిసరిగా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎండీ ముక్రం, డాక్టర్‌ కేపీఆర్‌, డాక్టర్‌ ప్రణీత్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -