నేను- కత్తెరను
నేను- బ్లేడుకన్నా పదునైన కత్తిని
నేను-పళ్ళ దువ్వెనను
మేం ముగ్గురం వేదకాలం నుండే మిత్రులం
పుట్టువెంట్రుకలు తీయడం దగ్గరనుండి
ఉపనయనం, పెళ్ళిళ్ళు, తీర్థ యాత్రలు, మొక్కులు
తీర్చుకోవడంతో పాటు-
మరణానంతర ఖర్మలవరకు-
ఒకరికొకరం కలిసిమెలిసి
చిటపట సవ్వడితో నాట్యం చేసిన చోట,
నిశితమైన చూపులతో, నిబ్బరమైన చేతులతో
ఎన్నో తలలకు అందాలు అద్దాము
మేము ముగ్గురం కలిసిమెలిసి
ఎక్కడ ఉంటే అక్కడ
సంప్రదాయబద్ధమైన కర్మకాండలలో
తలలు పరిశుభ్రత పవిత్రత
సంతరించుకుంటాయి
చెడును తొలగించి, శిశువుకు మంచి
భవిష్యత్తును ప్రసాదించమని
దేవుడిని కోరుతూ
పుట్టు వెంట్రుకలు తీశామంటే
ఆ చేతుల్లోని నైపుణ్యం,
ఆ కళ్ళలోని నిజాయితీకి
దేవదేవుని ఆశీర్వచనం లభించినట్లే
కులవత్తి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ
కత్తిపట్టిన చేయి మరచిపోదు
తన ప్రాచీన వారసత్వాన్ని
క్షురవత్తి కేవలం జుట్టు కత్తిరించడం,
గడ్డం గీయడం మాత్రమే కాదు
అది ఒక సంస్కతి, అది ఒక వారసత్వం.
– విల్సన్ రావు కొమ్మవరపు,
89854 35515
నేనూ-నా మిత్రులు
- Advertisement -
- Advertisement -