Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయందశలవారీగా ఆలయాల అభివృద్ధికి చర్యలు

దశలవారీగా ఆలయాల అభివృద్ధికి చర్యలు

- Advertisement -

– బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-ముధోల్‌

ప్రభుత్వం అన్ని ఆలయాలను దశలవారీగా అభివృద్ధి చేస్తుందని, బాసర నూతన ఆలయ అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. నిర్మల్‌ జిల్లా బాసర మండల కేంద్రంలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే మహంకాళి, దత్తాత్రేయ స్వామిని కూడా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం వసతి గృహంలో జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మంత్రికి నిర్మల్‌ పెయింటింగ్స్‌ చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌ అమలుపై ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు ట్రిపుల్‌ఐటీ వసతి గృహంలో మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌, ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్‌ కిషోర్‌ కుమార్‌, ఆర్డీఓ కోమల్‌ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్‌ పాఠక్‌, ఈఓ సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ మమ్మయి రమేష్‌, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad