Tuesday, August 5, 2025
E-PAPER
Homeఖమ్మంబహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు నివారణకు చర్యలు సరే...

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు నివారణకు చర్యలు సరే…

- Advertisement -

సామాజిక మరుగుదొడ్లు (పబ్లిక్ టాయిలెట్ లు) సౌకర్యం ఏది?
వ్యర్ధాలు వదిలిన వారికి రూ.5000 లు అపరాధ రుసుం…
చూసి సమాచారం ఇచ్చిన వారికి రూ.1000 పారితోషికం: కమీషనర్ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట

మున్సిపాల్టీ పరిధిలోని బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన,మాంసాహార ఇతర వ్యర్ధాలను నివారించడానికి మున్సిపాల్టీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు సిబ్బంది మంగళవారం దొంతికుంట చెరువు కట్ట పై హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసారు.

చెరువు పరిసరాల్లో గానీ,చెరువులో ఏ రకం అయిన వ్యర్ధాలను వదిలిన,మలమూత్ర విసర్జన లు చేసిన వారికి రూ.5 వేలు అపరాధ రుసుం విధిస్తామని,అలాంటి అసభ్య వ్యవహారాలకు పాల్పడిన వారి ఆచూకి,సమాచారం,ఫొటో ద్వారా తెలిపిన వారికి రూ.1000 లు పారితోషికం ఇవ్వనున్నట్లు కమీషనర్ నాగరాజు పేరుతో హెచ్చరిక బోర్డు ను ప్రదర్శించారు.

సామాజిక మెరుగు దొడ్లు ఏవి?

కానీ రోజు రోజు కు విస్తరిస్తున్న పట్టణ జనాభా,వ్యాపార లావాదేవీలకు అనుగుణంగా పట్టణంలో సామాజిక మరుగుదొడ్లు లేకపోవడం విచారకరం. ముందుగా ప్రజలు సౌకర్యార్ధం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుచేసి ఇలాంటి వ్యర్ధాలు నివారణకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని పట్టణ వాసులు,పట్టణానికి వ్యాపార,వ్యవహారములు నిమిత్తం వచ్చీపోయే ప్రయాణీకులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -