Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ లో ప్రథమ స్థానం సాధించిన  మెదక్ జిల్లా బాలికల జట్టు

రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ లో ప్రథమ స్థానం సాధించిన  మెదక్ జిల్లా బాలికల జట్టు

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి
రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో ప్రథమ స్థానం సాధించడం జరిగిందని మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యుడు  బైరయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 14 వరకు జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం కూనుర్ లో జరిగిన 44వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో ఉమ్మడి మెదక్ జిల్లా  బాలికల జట్టు మంచి సెమి ఫైనల్ లో లో మంచి ప్రతిభను కనబరిచి ఆదిలాబాద్ ను ఓడించి ఫైనల్ కి చేరింది. ఫైనల్ లో కూడా లో అద్భుతంగా రాణించి ఖమ్మం జిల్లా జట్టును ఓడించి ప్రథమ స్థానం సాధించరు.  రాష్ట్ర స్థాయిలో  జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానం సాధించడం పట్ల ఉమ్మడి మెదక్ జిల్లా జనరల్ సెకరేటరీ పీవి.రమణ,ట్రెజరర్ శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రటరీ శరణప్ప హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -