Saturday, November 8, 2025
E-PAPER
Homeఆటలుప్రతిక రావల్‌కు మెడల్‌

ప్రతిక రావల్‌కు మెడల్‌

- Advertisement -

న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ విజయంలో యువ ఓపెనర్‌ ప్రతిక రావల్‌ కీలక పాత్ర పోషించింది. ఓపెనర్‌గా స్మృతీ మంధానతో కలిసి నిలకడగా విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసిన ప్రతిక రావల్‌.. బంగ్లాదేశ్‌తో ఆఖరు గ్రూప్‌ దశ మ్యాచ్‌లో గాయపడింది. దీంతో సెమీఫైనల్‌, ఫైనల్‌కు దూరమైంది. రావల్‌ స్థానంలో డ్యాషింగ్‌ ఓపెనర్‌ షెఫాలీ వర్మ జట్టులోకి వచ్చింది. టైటిల్‌ పోరులో బ్యాట్‌తో, బంతితో షెఫాలీ వర్మ చిరస్మరణీయ ప్రదర్శన చేసింది. చాంపియన్‌గా నిలిచిన భారత జట్టుకు ఐసీసీ బంగారు పతకాలు ప్రదానం చేసింది. ఫైనల్లో ఆడిన 15 మంది భారత జట్టులో ప్రతిక రావల్‌ భాగం కాదు. దీంతో ప్రతికకు ఐసీసీ నుంచి గోల్డ్‌ మెడల్‌ అందలేదు.

ఐసీసీ రూల్స్‌ ప్రకారం 15 మెడల్సే ఇవ్వటంతో ప్రతిక మెడల్‌ లేకుండానే భారత జట్టు సంబురాల్లో పాలుపంచుకుంది. ఐసీసీ చైర్మెన్‌ జై షాతో జోక్యంతో ప్రతిక రావల్‌కు సైతం బంగారు పతకం అందించారు. దీంతో రావల్‌ సంతోషం వ్యక్తం చేసింది. ‘ఇప్పుడు నాకు విన్నింగ్‌ మెడల్‌ ఉంది. విజయానంతరం సహాయక సిబ్బంది ఒకరు నాకు వాళ్ల మెడల్‌ను ఇచ్చారు. జై షా నాకు ఓ మెడల్‌ పంపించారు. మెడల్‌ నాకు ఇంకా చేరలేదు. కానీ నాకూ బంగారు పతకం వస్తుందనే సంతోషం మాటల్లో చెప్పలేను’ అని రావల్‌ తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -