నవతెలంగాణ – పెద్దవూర
ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మొబైల్ వైద్య బృందం డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం మండలం లోని జిల్లా పరిషత్ చలకుర్తి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు, బీపీ, షుగర్, అనారోగ్య సమస్యలు ఏమైనా వున్నాయా అని బృందం పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల ఎదుగుదలను ట్రాక్ చేయడానికి పునరావృతమయ్యే అనారోగ్యాలను గుర్తించడంలో వైద్య బృందం సహకారం అందించారు. ముఖ్యంగా ఈ శిబిరాల ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించి, వారికి అవసరమైన సలహాలు, చికిత్సలు అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్ధారించడం మరియు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం జరిగిందని వైద్య బృందం తెలిపారు. అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 
చలకుర్తి ఉన్నత పాఠశాలలో వైద్య శిబిరం..
- Advertisement -
- Advertisement -

                                    

