నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో ఎల్లారెడ్డి డివిజన్ సామాజిక ఆరోగ్య అధికారి జి. ఠాగూర్, సబ్ యూనిట్ అధికారి పాశం గోవిందరెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉత్తనూర్ పరిధిలోని గాంధారి ఉపకేంద్రం సిబ్బందితో సమన్వయం చేసుకొని, గాంధారి గ్రామంలోని కిసాన్ నగర్, కుమ్మరి గల్లీలో మెడికల్ క్యాంపులు నిర్వహించమని ఎల్లారెడ్డి డివిజన్ సామాజిక ఆరోగ్య అధికారి ఠాగూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించి జ్వరంతో బాధపడుతున్న గ్రామస్తులను క్యాంపుకు తరలించి చికిత్స చేయడం జరిగినది. జ్వరంతో ఉన్నవారికి మలేరియా జ్వరము అనుమానంతో రక్తపూతలు సేకరించి ఊహాజనిత చికిత్స చేయడం జరిగినది. అధిక టెంపరేచర్ తో ఉన్న జ్వర రోగులను ఆర్డిటి కిట్ ద్వారా డెంగు నిర్ధారణ పరీక్షలు చేయడం జరిగినది. అదేవిధంగా దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు ఉన్న సామాన్య రుగ్మతలు గల ప్రజలకు చికిత్స చేసి ఉచితంగా మందులు అందజేయడం జరిగినది. అధిక వర్షాల కారణంగా ప్రజలు కాచి చల్లార్చిన నీటిని సేవించవలసినదిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఆశా వర్కర్లు ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నీట మునిగిన గ్రామాల ప్రజలకు మెడికల్ క్యాంప్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES