Saturday, July 26, 2025
E-PAPER
Homeఖమ్మంపండువారిగూడెంలో వైద్య శిబిరం..

పండువారిగూడెంలో వైద్య శిబిరం..

- Advertisement -

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం…
గుమ్మడి వల్లి వైద్యులు డాక్టర్ వెంకటేష్
నవతెలంగాణ – అశ్వారావుపేట

పోషకాలు ఉన్న ఆహారం తో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అని గుమ్మడి వల్లి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వెంకటేష్ తెలిపారు.

నాబార్డ్ సహాకారం,వాసన్ పర్యవేక్షణ లో శుక్రవారం మండలంలోని పండువారిగూడెం జీవ వనరుల కేంద్రంలో గుమ్మడి వల్లి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ వెంకటేష్ పర్యవేక్షణలో నిర్వహించిన వైద్య శిబిరం పోషకాహారం పై అవగాహన కల్పించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విటమిన్లు అధికంగా ఉండే పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవాలన్నారు.ఆకు కూరలు తీసుకుంటే ఆరోగ్యంతోపాటు,కంటి చూపుకు మంచిదన్నారు. మటన్,చికెన్ లో మాంసకృత్తులు  ఉంటాయన్నారు.

సేంద్రీయ సాగు(నేచురల్ ఫార్మింగ్ )చేయటం వల్ల మృత్తికా సారం,మన ఆరోగ్యం కాపాడుకోవచ్చని, రసాయనాలను వినియోగించడం వల్ల నేల ఆరోగ్యం,మన ఆరోగ్యం క్షీణిస్తుంది అని,దీంతో రోగాల బారిన పడుతున్నామని అవగాహన కల్పించారు.

అనంతరం పండువారిగూడెం, దిబ్బగూడెం,కొండతోగు, మల్లాయిగూడెం గ్రామాల్లోని సుమారు 96 మంది ని పరీక్షించారు. 

ఈ కార్యక్రమంలో డీపీఎంఓ మోహన్, హెల్త్ అస్స్టెంట్ వెంకటేశ్వరావు, స్టాఫ్ నర్స్  రహంతుల్లా,శాంతి కుమారి, విజయ కుమారి, మధు,ఆశ కార్యకర్తలు, కో ఆర్డినేటర్ వెంకటేశ్వరావు, శ్రీనివాసరావు, జీవ కమిటీ సభ్యులు దారా ప్రసాద్, కొర్రి మల్లయ్య, మాలెం భీమరాజు,దానపు. మంగ రాజు, రాములమ్మ, మొడియం దుర్గారావు, సీసం రాంబాబు, సీసం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -