– హాజరు కానున్న జిల్లా అధికారులు : డాక్టర్ రాందాస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ )అధికారి రాహుల్ ఆదేశానుసారం, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సైదులు ఆధ్వర్యంలో మండలంలోని అశ్వారావుపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల రెడ్డిగూడెం పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 11న ప్రత్యేక వైద్య సదస్సు నిర్వహించనున్నట్లు స్థానిక వైద్యాధికారి డాక్టర్ రాందాస్ ఆదివారం తెలిపారు. ఈ శిబిరంలో కంటి,స్త్రీల,చిన్న పిల్లల,హృదయ,మానసిక, క్షయ మొదలగు వ్యాధులపై ప్రత్యేక సదుపాయాలు తో కూడిన వైద్య సదస్సు ఉంటుంది అన్నారు. కావున రెడ్డి గూడెం గ్రామ పరిసర ప్రాంత ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోని చికిత్స తీసుకోవాలని కోరారు.
ఈ నెల 11న రెడ్డిగూడెంలో వైద్యశిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



