- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ అధికారి యేమిమా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్న 14 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు చేసి మలేరియా, డెంగ్యూ, ఆర్ టి డి పరీక్షలు చేసి నెగిటివ్ రావడంతో మందులు అందజేశారు. హాస్టల్ పరిసరాలను ఎంపీహెచ్వో వెంకటరమణ, ఎంపీహెచ్ఏ సతీష్, ఏఎన్ఎం శ్యామల, ఆశా కార్యకర్తలు హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. నీటి నిలువలు లేకుండా పరిశుభ్రంగా ఉంచినందుకు వార్డెన్ సునీతను అభినందించారు. పిల్లలందరికీ సీజన్లో వచ్చే వ్యాధుల నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు తెలియజేశారు.
- Advertisement -