నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం డాక్టర్స్ డే ను పురస్కరించుకొని వైద్యాధికారిణి డాక్టర్ స్పందనను ఆస్పత్రి సిబ్బంది ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆస్పత్రి సిబ్బంది మాట్లాడుతూ .. నేటి సమాజంలో వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సేవలను కొనియాడారు. ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తున్న డాక్టర్ స్పందన సేవలు మర్చిపోలేని పేర్కొంటూ ఆమె అందిస్తున్న సేవలను ప్రశంసించారు. అనంతరం కేక్ కట్ చేయించి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి సత్యనారాయణ, ఆరోగ్య పర్యవేక్షకురాలు స్వరూప, ఫార్మసిస్ట్ అరుణ్, డిఇఓ మధు, సిబ్బంది పాల్గొన్నారు.
చౌట్ పల్లిలో వైద్యాధికారిణికి సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES