Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్య సిబ్బందికీ సిపిఆర్ పై అవగాహన ఉండాలి

వైద్య సిబ్బందికీ సిపిఆర్ పై అవగాహన ఉండాలి

- Advertisement -

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లే శ్రీనివాసులు 
నవతెలంగాణ – వనపర్తి

వైద్య సిబ్బంది అందరికీ సిపిఆర్ విధానంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అల్లే శ్రీనివాసులు సూచించారు. జిల్లా ఎన్సీడీ సెల్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో సీపీఆర్ (Cardio Pulmonary Resuscitation) అవగాహన శిక్షణా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అల్లే శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించడంలో సీపీఆర్ కీలక పాత్రను వివరించారు. ఆయన మాట్లాడుతూ“ప్రతి ఒక్కరూ సీపీఆర్ పద్ధతిని నేర్చుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించడంలో భాగస్వామ్యం కావచ్చన్నారు.

సమయానికి సరైన విధంగా చర్య తీసుకుంటే విలువైన ప్రాణాలు కాపాడవచ్చు”అని పేర్కొన్నారు. డా. అల్లే శ్రీనివాసులు స్వయంగా సీపీఆర్ ప్రదర్శన చేసి, ఛాతీ ఒత్తడం (Chest Compressions) శ్వాసనిచ్చే (Rescue Breaths) పద్ధతులను వివరించారు. ప్రాక్టికల్ శిక్షణలో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా 108 సమన్వయ అధికారి మెహబూబ్, జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ నవీద్ పాల్గొని సీపీఆర్ శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి ఉత్తేజాన్నిచ్చారు.

ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచిన జిల్లా ఎన్సీడీ బృంద సభ్యులు శ్రీనివాస్ కొండ, అశోక్ కుమార్, సీపీఆర్ అవగాహన వారం (13–17 అక్టోబర్ 2025) సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అవగాహన కార్యక్రమాల ప్రాముఖ్యతను వివరించారు.

కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. సీపీఆర్ పద్ధతులు, హార్ట్ అటాక్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, అత్యవసర సాయం కోసం 108 సేవలను ఉపయోగించుకోవాలనే అంశాలపై వివరమైన అవగాహన కల్పించారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా “ప్రతి ఒక్కరి చేతిలో ఒక ప్రాణరక్షణ నైపుణ్యం ఉండాలి” అనే సందేశం స్పష్టంగా చేరిందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -