– మండల ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు
నవతెలంగాణ – కట్టంగూర్ : ప్రస్తుత సీజన్లో వచ్చే అంటువ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండి వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి పి కోటేశ్వరరావు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.రాబోవు మూడు నెలలు చాలా కీలకమని, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు చాలా ప్రమాదకరమని, వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్సను అందించాలన్నారు. ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించాలని, క్షేత్రస్థాయిలో పర్యటించి సూచనలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. జ్ఞాన ప్రకాష్ రావు, మండల పంచాయతీ అధికారి కె. స్వరూప రాణి గారు, మండల వైద్యాధికారి శ్వేత, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం నర్సులు, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES