- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీహిల్స్‌లో పథకం ప్రకారమే భార్య స్వాతి (25)ని భర్త మహేందర్ చంపేశాడని మల్కాజ్‌గిరి డీసీపీ పద్మజ తెలిపారు. హ్యాక్‌సా బ్లేడ్‌తో మృతదేహాన్ని ముక్కలుగా కోశాడని.. విడతల వారీగా శరీర భాగాలను తీసుకెళ్లి మూసీ నదిలో పారేశాడని వివరించారు. ‘‘మృతదేహాన్ని మాయం చేసేందుకు భర్త అన్నివిధాలుగా ప్రయత్నించాడు. భార్య శరీర భాగాలు కొన్నింటిని తీసుకెళ్లి పారేశాడు. పోలీసులు ఇంటికి వెళ్లి చూసేసరికి కేవలం మొండెం మాత్రమే మిగిలి ఉంది. శరీర భాగాల కోసం మూసీలో గాలిస్తున్నాం’’అని డీసీపీ తెలిపారు.
- Advertisement -