Saturday, September 13, 2025
E-PAPER
Homeఆటలుమీనాక్షి పతక పంచ్‌

మీనాక్షి పతక పంచ్‌

- Advertisement -

బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌

లివర్‌పూల్‌ (ఇంగ్లాండ్‌) : వరల్డ్‌ బాక్సింగ్‌ (డబ్ల్యూబీ) ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ నాల్గో పతకం ఖాయం చేసుకుంది. మహిళల 48 కేజీల విభాగంలో మీనాక్షి 5-0తో ఇంగ్లాండ్‌ బాక్సర్‌ అలైస్‌పై ఏకపక్ష విజయం సాధించింది. మూడు రౌండ్లలో ఇంగ్లాండ్‌ బాక్సర్‌పై పిడి గుద్దుల వర్షం కురిపించిన మీనాక్షి.. ఐదుగురు రిఫరీల ఏకగ్రీవ విజేతగా నిలిచింది. ఈ విభాగంలో సెమీఫైనల్స్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకుంది. మహిళల 80+ కేజీల విభాగంలో నుపుర్‌, 57 కేజీల విభాగంలో జైస్మిన్‌ లాంబోరియ, 80 కేజీల విభాగంలో పూజ రాణి సెమీఫైనల్స్‌కు చేరుకుని కనీసం కాంస్య పతకం ఖాయం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో హ్యట్రిక్‌ పసిడి పతకమే లక్ష్యంగా లివర్‌పూల్‌కు వచ్చిన భారత స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మహిళల 51 కేజీల విభాగం క్వార్టర్‌ఫైనల్లో అనూహ్య పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -