కొత్త సిటిజన్ చార్టర్ అమల
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా లో మీ సేవ ఆపరేటర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.కమిషన్ పెంపుతో పాటు కొత్త సిటిజన్ చార్టర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు జిల్లా మీ సేవ యూనియన్ల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.నిజామాబాద్ జిల్లాలోని మీ సేవ ఆపరేటర్లకు సంబంధించిన రెండు యూనియన్లు టీఎంఓసిఏ, ఏఎంసిఓఏ గత సంవత్సరం 2025 లో జేఏసీగా ఏర్పడ్డాయి. గత పది సంవత్సరాలుగా జిల్లా యూనియన్ సభ్యులు కలిసి కమిషన్ పెంపు కోసం కమిషనర్,ఐటీ సెక్రటరీ మరియు ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను గుర్తించి,మీ సేవ సేవలపై కమిషన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ఈ సందర్భంగా కమిషన్ పెంపుకు సహకరించిన జిల్లా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,అలాగే మీ సేవ కమిషనర్ రవి కిరణ్‌లకు జిల్లా యూనియన్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెరిగిన కమిషన్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. అదే రోజు నుంచి కొత్త సిటిజన్ చార్టర్ కూడా అమలులోకి వచ్చింది.ఏప్రిల్ 3,2026 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 5,2026 ఉదయం 8 గంటల వరకు సాంకేతిక కారణాల వల్ల సేవల్లో అంతరాయం ఉండవచ్చని,ప్రజలు గమనించి సహకరించాలని యూనియన్ నాయకులు కోరారు.
ప్రభుత్వం మా సమస్యలను గుర్తించి కమిషన్ పెంచడం సంతోషకరం. భవిష్యత్తులో కూడా మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా మీ సేవ నాయకులు ఏ ఎం సి ఓ ఏ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల శ్రీనివాస్, టి ఎం ఓ ఏ జిల్లా అధ్యక్షుడు కే లక్ష్మీనారాయణ, పెద్దోళ్ళ కిషోర్, ధర్మానందం, జివిఆర్, శివకుమార్,విశ్వనాథ్, సంతోష్, మహమ్మద్ నజీర్ అహ్మద్, సయ్యద్ ఉబేద్ హైమద్, చింత రాజు, పెద్దోళ్ల రమేశ్వర్, తిరుపతి,పి శివకుమార్, పల్లికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.



