– అధికారి ప్రతిపక్షం నాయకులు గైర్హాజరు
– ఓటరు జాబితా పై అభ్యంతరాలు ఉంటే తెలపండి
– ఎంపీడీఓ అప్పారావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామపంచాయతీ ఎన్నికలు – 2025 ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఎంపీడీఓ అప్పారావు సూచించారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా ఫోటో ఓటర్ ముసాయిదా జాబితా,పోలింగ్ కేంద్రాల జాబితా ముసాయిదా అభ్యంతరాల పై మండలములోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం),సీపీఐ,బీజేపీ,టీడీపీ,జన సేన ప్రతినిధులు చిరంజీవి,రామక్రిష్ణ,మెట్ట వెంకటేష్,కట్రం స్వామి దొర,నార్లపాటి శ్రీను లు హాజరు అయ్యారు. అధికారి ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు డుమ్మా కొట్టారు.
స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES