20 మంది విద్యార్ధులు ముఖాముఖీలకు హాజరు…
నవతెలంగాణ – అశ్వారావుపేట : స్థానిక వ్యవసాయ కళాశాలలో వి.వి.సి ట్రాక్టర్స్ కంపెనీ ఆద్వర్యంలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. కళాశాల ప్లేస్ మెంట్ సెల్ ఇంచార్జి డాక్టర్ ఆర్.రమేష్ సమన్వయం లో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళా లో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత కుమార్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి, వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా వివిసి గ్రూప్ సీఈవో పుట్ట శ్రీనివాస్ మాట్లాడుతూ వి వి సి గ్రూప్ యొక్క ప్రాముఖ్యతను అందులో ఉండే ఉద్యోగావకాశాలు గురించి ఫైనల్ ఇయర్ బీఎస్సీ చదువుతున్న విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ ఉద్యోగ అవకాశం కోసం దాదాపు 20 మంది విద్యార్థులు ముఖాముఖీ ల (ఇంటర్వ్యూ) కి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఆర్ విభాగం అశోక్,మాధవి,స్పేర్ మేనేజర్ సతీష్ పాల్గొన్నారు.
వ్యవసాయ కళాశాలలో మెగా జాబ్ మేళా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES