Monday, July 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ లో ఆగస్టు 5న మెగా జాబ్ మేళా

ఆదిలాబాద్ లో ఆగస్టు 5న మెగా జాబ్ మేళా

- Advertisement -

ఎస్.ఎస్.సీ నుండి పీజీ వరకు అర్హులు
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేల ఆగస్టు 5న జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవనంలో మెగా  జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జాబ్ మేళా గురించి అన్ని శాఖల అధికారులు సహకరిస్తు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలోతెలంగాణ ప్రభుత్వ టాస్క్ ఆర్గనైజేషన్ టాస్క్ స్టేట్ ఆర్గనైజేషన్ ప్రదీప్ కుమార్, (టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా పోస్టర్లను విడుదల చేశారు. జాబ్ మేళాలపై అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటు అర్హులు సద్వినియోగం చేసుకునేల చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ… నిరుద్యోగ యువతకు ప్రయివేట్ సెక్టార్లో ఉద్యోగం కల్పించేల నిర్వహించే జాబ్ మేళను సద్వినియోగం చేసుకునేల ప్రతి శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. ఆయా కంపెనీల్లో 13 వందల ఖాళీల కోసం జాబ్ మేళా ఉంటుందన్నారు.

పదవ తరగతి నుంచి ఆపై చదువుకున్న వారికి వివిధ పోస్టుల్లో భర్తీ చేసుకుంటారని తెలిపారు.  ఈ జాబ్ మేళాలో దాదాపు 20 ఐటీ, నాన్ ఐటీ  కంపెనీలు పాల్గొని వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్.ఎస్.సీ నుండి పీజీ వరకూ అర్హత కలిగిన యువతకు టెక్నికల్ ,  నాన్ టెక్నికల్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వివరించారు. అభ్యర్థుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సంబంధిత అధికారులు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్, ఇతర సంస్థల ప్రతినిధులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులను ప్రోత్సహించి జాబ్ మేళాలో భాగస్వామ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలదేవి, శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, ఆర్డీఓ స్రవంతి, టాస్క్ మేనేజర్ సాయికుమార్, స్టేట్ ప్లెస్మెంట్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -