Sunday, December 7, 2025
E-PAPER
Homeజిల్లాలుమెగా రెడ్డన్న మీ అభ్యర్థి "నిర్మల" గెలుపు ఖాయం అన్న..

మెగా రెడ్డన్న మీ అభ్యర్థి “నిర్మల” గెలుపు ఖాయం అన్న..

- Advertisement -

మెగా రెడ్డి బలపరిచిన నిర్మలను గెలిపించేందుకు కొంపెల్లి బ్రహ్మరథం పడుతున్న గ్రామ ప్రజలు ..

మాయ మాటలు నమ్మి మోసపోతే “కొంపెల్లి” గ్రామ ప్రజలు గోసపడతారు..

గ్రామాభివృద్ధికై మేఘాన్నకు టీడీపీ కొంపల్లి శాఖ సంపూర్ణ మద్దతు..

నవతెలంగాణ మునుగోడు:

మునుగోడు మండలంలోని కొంపెల్లి గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే గొప్ప లక్ష్యంతో వెదిరె మేఘా రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామంలోని ప్రజలందరూ ఆకర్షితులై మెగా రెడ్డి బలపరిచిన అభ్యర్థి జీడిమడ్ల నిర్మల దశరథను గెలిపించేందుకు గ్రామంలోని ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఆదివారం టీడీపీ కొంపల్లి గ్రామ శాఖ మెగా రెడ్డి బలపరిచిన అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మెగా రెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు పార్టీలకతీతంగా గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటు వేసి నిర్మలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాయ మాటలు చెప్పే నాయకుల మాటలు చెప్పే నాయకుల మాటలు నమ్మి మోసపోతే కొంపెల్లి గ్రామ ప్రజలు గోసబడతారని అన్నారు.

ఈ కార్యక్రమంలో వెదిరె విజేందర్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి జీడిమడ్ల నిర్మల, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు వీరమళ్ళ అశోక్, గ్రామ శాఖ అధ్యక్షుడు మొగుదాల స్వామి, మక్కెన కోటేశ్వర రావు, వీరమళ్ళ యాదయ్య, వీరమళ్ళ కృష్ణయ్య, ఆళ్ల రాజు, జోసెఫ్, మొగుదాల బుచ్చయ్య, వీరమళ్ళ భాస్కర్, సూర చంద్రయ్య, నాంపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -