Wednesday, August 6, 2025
E-PAPER
Homeసినిమామెగాస్టార్‌ బర్త్‌డే కానుకగా..

మెగాస్టార్‌ బర్త్‌డే కానుకగా..

- Advertisement -

డైరెక్టర్‌ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్‌ బ్యానర్‌ పై విజయ్ పాల్‌ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. మోహన్‌ శ్రీవత్స దర్శకుడు.
సత్య రాజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్‌ సింహా, సత్యం రాజేష్‌, ఉదయభాను, క్రాంతి కిరణ్‌, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు.
ఈ సందర్భంగా సత్య రాజ్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. మేమంతా కూడా మాదే మెయిన్‌ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కథే మెయిన్‌ హీరో. డైరెక్టర్‌ మోహన్‌, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రాజేష్‌ వీళ్లే అసలైన బాణాలు. నా డియర్‌ ఫ్రెండ్‌ చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిరంజీవి కంప్లీట్‌ యాక్టర్‌. ఆయన గొప్ప నటుడు, డ్యాన్సర్‌, అద్భుతమైన వ్యక్తి. మా మూవీ ఆయన పుట్టిన రోజున రిలీజ్‌ అవుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
‘ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమిది. మా చిత్రం ఈనెల 22న రాబోతోంది. మా మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ మీకు నచ్చితేనే సపోర్ట్‌ చేయండి. ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది’ అని ప్రొడ్యూసర్‌ విజయ్ పాల్‌ రెడ్డి చెప్పారు.
దర్శకుడు మోహన్‌ శ్రీవత్స మాట్లాడుతూ, ‘క్లారిటీ, కమిట్‌ మెంట్‌, కంటెంట్‌ ఉన్న చిత్రమిది. మా బాస్‌ మెగాస్టార్‌ బర్త్‌ డే సందర్భంగా మా చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతోన్నాం. అందరూ హిట్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -