Wednesday, October 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి అల్లూరి లక్ష్మణ్ ను కలిసిన తుర్క కాశ సంక్షేమ సంఘం సభ్యులు

మంత్రి అల్లూరి లక్ష్మణ్ ను కలిసిన తుర్క కాశ సంక్షేమ సంఘం సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ – మిరుదొడ్డి 
ఎస్సీ ఎస్టీలు విద్య వైద్య రంగంలో వెనుకబడి ఉన్నారు వారికి ప్రభుత్వం అండగా నిలవాలని ఎస్సీ ఎస్టీల   రాష్ట్ర అధ్యక్షులు షేక్ బడే సాబ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ షాదుల్లా లు అన్నారు. బుధవారం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్  తుర్క కాశ సంక్షేమ సంగం తరపున తుర్క కాశ నాయకులు తుర్క కాశ సహోదరుల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తురక కాశ సహోదరులు ఇప్పటికీ దుర్భర జీవితాల గురించి మరియు విద్య వైద్యం పరంగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని అన్నారు.తుర్క కాశ కార్మికులు అనేక సంవత్సరాలుగా రాయిని కొట్టుకొని జీవనం సాగిస్తున్నారు. 

చేనేత కార్మికులు మరియు గీత గీత కార్మికుల విధంగా 45 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేయాలని అదేవిధంగా రాళ్లను కొట్టే సమయంలో ఏదన్న అఘాయిత్యం జరిగినప్పుడు ప్రమాద బీమా ఎక్స్గ్రేషియా 10 లక్షలు ఇవ్వాలని కోరారు. తుర్క కాశ కార్మికులు గుడిసెల్లో జీవితాలను గడుపుతున్నారు. కాబట్టి ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని మంత్రి కి కోరారు. ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు షేక్ గౌస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు షేక్ మౌలానా తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు షేక్ ఇమామ్ మరియు తుర్క కాశ కార్మికులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -