Saturday, December 27, 2025
E-PAPER
Homeజిల్లాలుఎస్ఐ అనిల్ రెడ్డిని కలిసిన ఉప్లూర్ పాలకవర్గం సభ్యులు

ఎస్ఐ అనిల్ రెడ్డిని కలిసిన ఉప్లూర్ పాలకవర్గం సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామ పంచాయితీ నూతన పాలకవర్గం సభ్యులు శనివారం కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లోని వారి కార్యాలయంలో సర్పంచ్ యెనుగందుల శైలేందర్, ఉప సర్పంచ్ తక్కురి రాజశేఖర్, పలువురు వార్డు సభ్యులు ఎస్ఐ అనిల్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సభ్యులకు ఎస్ఐ అనిల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సర్పంచ్ శైలేందర్ మాట్లాడుతూ గ్రామంలో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.రోడ్డు ప్రమాదలపై, మత్తు పదార్థాల వల్లే వచ్చే నష్టాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉప్లూర్ ను సురక్షితమైన, ఆరోగ్యవంతమైన గ్రామంగా నెలకొల్పేందుకు శాఖ పరమైన సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ రెడ్డికి  గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు విన్నవించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రాకేష్, సదుల్లా, కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్దం తిరుపతిరెడ్డి, సుంకరి విజయ్ కుమార్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -