Sunday, November 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిస్మృత్యంజలి

స్మృత్యంజలి

- Advertisement -

కన్నబిడ్డలకు గుక్కెడు పాలివ్వలేని
ఎండినస్తనంలా ఉంది పాలస్తీనా
పిల్లల గాజు కండ్లలో
గాజా ఇంకిపోయింది

పిల్లలకు పాలిస్తినా రక్తమిస్తినా
తెలియని తల్లులు నడిచే శవాలు
గాజా ఇప్పుడు
పసి కంకళాల పాలరోదన
శిథిల శిశువుల్ని పదిల పరుస్తున్నా
శవాగారంలా ఉంది గాజా
ప్రతి ఇల్లు సజీవ ఖబరస్తాన్‌

కరుకుకోరల రక్కసిమూకకు
తలదన్నే పరమ కిరాతకునిలా
ఇజ్రాయిల్‌ నెతన్యాహు
ఇంగితంలేని నరభక్షీ

ఇరవై వేలపసి పువ్వుల్ని
చిదిమిన తూటమాలి
డాలరు కళ్ల ఇజ్రా
పాడునట శాంతిముజ్రా

విషమైన ఆలస్య నిర్ణయం
మృతశేషాల స్మృత్యంజలి
ఆయుధబేహారికి
యుద్ధరంగమే విఫణిస్థలి

షుకూర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -