నవతెలంగాణ – తుంగతుర్తి
కన్నవారి జ్ఞాపకాలు…సేవా ప్రతిరూపాలని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్, తుంగతుర్తి సొసైటీ చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. ఆదివారం తన తండ్రి గుడిపాటి ఫకీర్ యొక్క 7వ వర్ధంతి సందర్భంగా తన సొంత గ్రామం వెలుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, కంపాక్స్, పెన్నులు, పెన్సిళ్లు మొత్తం రూ.3500 విలువగల సామాగ్రిని అందజేశారు. తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడం అనేది ఒక సామాజిక సేవని, దీని ద్వారా విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గుతుందని, విద్యకు ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు గొడుగు అబ్బయ్య,ఫకీర్ మనవడు ధర్మారపు సాయి తేజ పాల్గొన్నారు.
కన్నవారి జ్ఞాపకాలు.. సేవా ప్రతిరూపాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



