Monday, October 20, 2025
E-PAPER
Homeదర్వాజఒదిగిపోయే జ్ఞాపకాలు!

ఒదిగిపోయే జ్ఞాపకాలు!

- Advertisement -

కవికి కాలానికి వద్ధాప్యముండదు
గాయాలను మాన్పుకుంటూ పయనించడమే
ఒక అప్రకటిత సందేశం!
కాలానికి తెలుసు
పరిణామ క్రమంలో వచ్చే
హెచ్చుతగ్గులు దాని వెనుక దాగిన
చీకటి వెలుగులు!
కవి గుండెకు తెలుసు
సముద్రపు లోతులు
అట్టడుగున ఎగిసిపడే
ఆటుపోట్ల సుడిగుండాలు!
కాలము సముద్రము
ఎప్పటికీ యవ్వనం కోల్పోనట్లే
అంతకుమించి కవి
నిత్య యవ్వనోత్తేజుడు!
మరణం వరించి వచ్చినా
పద్యం నాలుగో పాదం పూర్తిగానిదే
యముని మహిషపు
లోహ గంటలకు ప్రవేశం ఉండదు!
కాలం కరిగిపోయినా
కవి ఒరిగిపోయినా
చరిత్ర పుటల్లో ఆచంద్రార్కం
ఒదిగిపోయే జ్ఞాపకాలే!!

  • కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 9440233261
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -