Sunday, September 14, 2025
E-PAPER
Homeహెల్త్శబ్దాల వలలో మానసిక ఆరోగ్యం

శబ్దాల వలలో మానసిక ఆరోగ్యం

- Advertisement -

రమ్య చిన్న శబ్దం విన్నా చిరాకు, అసహనం చూపిస్తుంది. పరిశీలనలో తెలిసింది ఏమిటంటే, ఇంట్లో అమ్మా, నాన్న తరచూ గట్టిగా అరుస్తూ గొడవ పడుతుండేవారు. ఈ నిరంతర శబ్ద వాతావరణం రమ్య మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపింది. దాని ఫలితంగా ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి తగ్గడం, అందరిమీదా అరవడం వంటి లక్షణాలు కనిపించాయి.
ఇక ఇప్పుడు పట్టణాలు, గ్రామాల్లో ఫంక్షన్లు, వేడుకలు, ర్యాలీలు జరిగే సమయంలో పాటలు, డ్రమ్స్‌, డిజె సౌండ్స్‌ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇవి యువతపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని సష్టిస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు చదువుపై దష్టి పెట్టలేకపోతున్నారు. రాత్రి వేళల్లో పెద్ద సౌండ్‌ వల్ల నిద్రలేమి, ఆందోళన, అలసట పెరుగుతున్నాయి.

  1. పర్యావరణ ప్రభావం
    నిరంతర శబ్దం స్ట్రెస్‌ హార్మోన్లను (cortisol, adrenaline)పెంచి, మెదడు ఎప్పుడూ ఉద్రిక్త స్థితిలో ఉండేలా చేస్తుంది. దీని వల్ల చిన్న విషయాలకే కోపం, ఆందోళన వస్తాయి.
  2. చిన్ననాటి అనుభవాలు
    ఇంట్లో గొడవలు, బయట డిజె సౌండ్స్‌ వంటి వాటికి అలవాటు పడిన పిల్లలు దీర్ఘకాలంలో మానసిక అస్థిరతకు గురవుతారు.
  3. జ్ఞాన సంబంధిత ప్రభావం
    శబ్ద కాలుష్యం ఏకాగ్రతను భంగం చేస్తుంది. విద్యార్థుల్లో చదువుపై దష్టి తగ్గిపోవడం, గుర్తుంచుకునే శక్తి తగ్గిపోవడం జరుగుతుంది.
  4. ప్రవర్తనా రూపాంతరం
    శబ్దం, ఉల్లాసం, గొడవ అనే భావన మైండ్‌లో బలపడుతుంది. దీని ఫలితంగా శాంతంగా ఉండలేకపోవడం, చిరాకు, కోపం పెరుగుతాయి.
  5. ఆధునిక యువత సమస్యలు
    ఫంక్షన్లలో పెద్ద సౌండ్స్‌ వల్ల స్లీప్‌ సైకిల్‌ దెబ్బతింటుంది. ఇది డిప్రెషన్‌, యాంగ్జైటీ, యాంగర్‌ ఇష్యూస్‌ పెరగడానికి కారణం అవుతుంది.
    డబ్ల్యూహెచ్‌ఒ రిపోర్టుల ప్రకారం, అధిక శబ్దం హదయ రోగాలు, రక్తపోటు, మానసిక రుగ్మతలకు కూడా దారితీస్తుంది.
    పరిష్కార మార్గాలు :
    థెరపీ, కౌన్సెలింగ్‌: శబ్దానికి అధిక సున్నితత్వం ఉన్నవారికి కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ చాలా ఉపయోగకరం.
    ప్రశాంత వాతావరణం: లైబ్రరీలు, మెడిటేషన్‌ సెంటర్స్‌, నాయిస్‌ ఫ్రీ జోన్స్‌ పెరగాలి.
    ప్రభుత్వ నియంత్రణలు: డిజె సౌండ్‌, మైక్‌ వాడకం మీద కఠిన నియమాలు అవసరం.
    తల్లిదండ్రుల అవగాహన: ఇంట్లో గొడవలు తగ్గించడం ద్వారా పిల్లలకు మానసిక ప్రశాంతత కల్పించవచ్చు.
    వ్యక్తిగత పద్ధతులు: ఇయర్‌ ప్లగ్స్‌ వాడటం, ధ్యానం, సంగీత థెరపీ, సమయానికి నిద్ర వంటి అలవాట్లు మానసిక ఆరోగ్యం కాపాడతాయి.
    శబ్ద కాలుష్యం కేవలం రోడ్లపై వాహనాలు, యంత్రాలు ఇచ్చే శబ్దమే కాదు, ఇంట్లో గొడవలు, డిజె పాటలు, డ్రమ్స్‌, మైక్‌లు కూడా దీనిలో భాగమే. ఇవన్నీ కలిపి పిల్లలు, యువత మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
    సమాజం, ప్రభుత్వం, కుటుంబం అందరూ కలిసికట్టుగా శబ్ద నియంత్రణ, అవగాహన పెంచితేనే మన భవిష్యత్‌ తరాలకు ప్రశాంత జీవనం లభిస్తుంది.
    డా|| హిప్నో పద్మా కమలాకర్‌, 9390044031 కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -