ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొత్త ఆశలు, ఆశయాలు, అక్ష్యం దిశగా కొత్త ప్రణాళికలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇదే సమయంలో ఒత్తిడి, భవిష్యత్తు అనిశ్చిత పెరుగుతుంది. విద్యార్థులు నూతన ఏడాదిలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఏకాగ్రతతో ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకోవాలి, మానసికంగా బలంగా ఉన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, భావోద్వేగ నియంత్రణలో నిర్ణయ సామర్థ్యం అభివృద్ధి చేసుకోవచ్చు.
గతేడాది చేసినటువంటి పొరపాట్లతో పాఠాలు నేర్చుని భవిష్యత్తు విజయానికి పునాదులు వేేయాలి.కొత్త సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు చదువు, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించడం, అవసరమైనప్పుడు సహాయం కోరడం, స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి వాటిని అలవర్చుకోవాలి.ఉద్యోగులు కూడా ఓపికతో కమ్యూనికేషన్, పని జీవిత సమతుల్యతను పాటించాలి.ఈ నూతన సంవత్సరంలో మానసిక ఆరోగ్యం కేవలం వ్యక్తిగత విషయం కాకుండా సమాజ బాధ్యతగా భావించాలి. ఆరోగ్యకరమైన మనస్సు విద్యార్థులకు బలమైన భవిష్యత్తు నిర్మిస్తే, ఉద్యోగులకు స్థిరమైన వృత్తి జీవనాన్ని అందిస్తుంది. మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే వ్యక్తులు, సంస్థలు, సమాజం సమగ్రంగా ముందుకు సాగగలవు.
- డాక్టర్ మహీపతి శ్రీనివాస్ రావు



