Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టీపిటిఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంఈఓ దోమకొండ అంజయ్య

టీపిటిఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎంఈఓ దోమకొండ అంజయ్య

- Advertisement -

నవతెలంగాణ-  మిరుదొడ్డి
2026 సంవత్సర సిద్దిపేట జిల్లా క్యాలండర్ ను ఆవిష్కరిస్తున్న‌ అక్బర్ పేట భూంపల్లి మండల విద్యాధికారి దోమకొండ అంజయ్య, భూంపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బి.రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపిటిఎఫ్ అక్బర్ పేట భూంపల్లి మండల శాఖ అధ్యక్షులు పెరుమాండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెమో 57 మరియు  హైకోర్టు తీర్పును అనుసరించి డి.ఎస్.సి 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలన్నారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.
పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని,ఉపాధ్యాయుల వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని,  పెండింగ్ లి ఉన్న ఐదు డి. ఎ. లను చెల్లించాలి. జూలై 2023 నుండి అమలు చేయాల్సిన  పి. ఆర్. సి.ని వెంటనే ప్రకటించాలి. హెల్త్ కార్డులను మంజూరు చేయాలి.  పాఠశాలలకు శానిటేషన్ గ్రాంట్స్ విడుదల చేయాలని అన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ర్యాకం మల్లేశం, జిల్లా కౌన్సిలర్లు రాములు, నాగరాజు, నాయకులు జి శివాజీ, ఉపాధ్యాయులు సంతోష,యాదయ్య, రాజు, ప్రవీణ్, అంగన్వాడి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -