- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ తన సహచరులు రోడ్రిగో డి పాల్, సువారెజ్‌తో కలిసి శనివారం తెల్లవారుజామున కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోల్‌కతాలో మధ్యాహ్నం వరకు పర్యటించిన తర్వాత, మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం లోపు హైదరాబాద్ చేరుకుని, ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొంటారు. ఈ మ్యాచ్ రేవంత్ రెడ్డి, మెస్సీ జట్ల మధ్య జరగనుంది.
- Advertisement -



