Monday, December 15, 2025
E-PAPER
Homeజాతీయంమెస్సీకి టీమిండియా జెర్సీ అంద‌జేత‌

మెస్సీకి టీమిండియా జెర్సీ అంద‌జేత‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌:‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా భార‌త్‌లో ప్ర‌ముఖ పుట్‌బాల్ ప్లేయ‌ర్ లియోనెల్ మెస్సీ ప‌ర్య‌ట‌న ముగిసింది. మొద‌ట‌గా మెస్సీ క‌ల‌క‌త్తా సంద‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. దీంతో ఉప్ప‌ల్ స్టేడియంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. సోమవారం మెస్సీ చివరిగా ఢిల్లీలో సందడి చేశాడు. రాజధానిలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఫుట్‌బాల్ అభిమానులతో కిక్కిరిసిపోయింది.

లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌తో కలిసి మెస్సీ మైదానంలోకి అడుగుపెట్టగానే స్టేడియం మొత్తం దద్దరిల్లింది. దాదాపు అరగంట పాటు మైదానంలో గడిపిన మెస్సీ, యువ ఆటగాళ్లతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడాడు.

అనంతరం మెస్సీ ఐసీసీ ఛైర్మన్ జై షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీలను కలిశాడు. ఈ సందర్భంగా జై షా భారత క్రికెట్ జట్టు జెర్సీని, ప్రత్యేకంగా సంతకం చేసిన బ్యాట్‌ను మెస్సీకి బహూకరించారు. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన టికెట్‌ను కూడా అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -