Thursday, December 11, 2025
E-PAPER
Homeజాతీయంహైదరాబాద్‌కు మెస్సీ.. రాహుల్, ప్రియాంక‌కు సీఎం ఆహ్వానం

హైదరాబాద్‌కు మెస్సీ.. రాహుల్, ప్రియాంక‌కు సీఎం ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈనెల 13న ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. ఒక ప్రముఖ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మెస్సీ హాజరవుతున్నారని, తాను కూడా అతిథిగా హాజరవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మెస్సీ కార్యక్రమానికి రావాలని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలను కోరానని, ఢిల్లీలో కలిసిన అందరినీ ఆహ్వానించినట్లు సీఎం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -