- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ ఈ నెల 13న హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఆ రోజు సాయంత్రం 4గంటలకు ఆయన హైదరాబాద్ చేరుకొని ఓ హోటల్‌లో రెస్ట్ తీసుకుంటారు. రాత్రి 7గంటలకు ఉప్పల్ స్టేడియానికి వెళ్లి సీఎం రేవంత్ టీంతో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత స్కూల్ పిల్లలతో ఇంటరాక్షన్ ఉండనుంది. అనంతరం పరేడ్, మెస్సీకి సన్మానం నిర్వహించనున్నారు. దాదాపు 2గంటల పర్యటన తర్వాత మెస్సీ అదే రోజు తిరుగు పయనమవుతారు.
- Advertisement -



