తాడిచెర్ల జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు తల్లిదండ్రులు, దాతల సాయంతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్నీ గురువారం ప్రారంభించింనట్లుగా కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత సంవత్సరం ఇదే విధంగా దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయడం జరిగిందన్నారు. మధ్యాహ్న భోజనం ఏర్పాటుతో విద్యార్థుల హాజరు శాతం మెరుగుపడి, పబ్లిక్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించి తెలంగాణ రాష్ట్రంలో కళాశాల మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
ఈ సంవత్సరానికి గాను పేరెంట్స్,టీచర్స్ సమీక్ష సమావేశం సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ విషయాన్ని చర్చించడం ద్వారా, విద్యార్థుల తల్లిదండ్రులు, దాతలు ముందుకు రావడంతో ఈ కార్యక్రమ ఏర్పాటుకు సాధ్యమైందన్నారు. ఈ సంవత్సరంలో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు సైన్స్, ఆర్ట్స్ విద్యార్థుల కొరకు కళాశాలలో ఏర్పాటు చేసిన స్పెషల్ తరగతులు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, క్లాట్ తరగతులు, విద్యార్థుల ముఖ హాజరు సంబంధించి ఇలా ఈ మధ్యాహ్న భోజనం అందించడం వల్ల ఎక్కువ శాతం విద్యార్థులు కళాశాలకు హాజరవుతారని దీంతో సంవత్సరం కూడా 100% ఉత్తీర్ణత సాధించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దాతలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.



