నవతెలంగాణ-హైదరాబాద్: ఆదివారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంతో తూర్పు ఆఫ్ఘనిస్తాన్ వణికింది. 6.0 తీవ్రతతో కూడిన భూకంపం రావడంతో వందల సంఖ్యలో ఇళ్లు నేల కూలిపోయినాయి.నంగర్‌హార్‌లో కనీసం తొమ్మిది మంది మరణించగా 25 మంది గాయపడ్డారని ప్రావిన్స్ ఆరోగ్య శాఖ ప్రతినిధి అజ్మల్ దర్వైష్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం భూకంపం ప్రభావిత ప్రాంతం నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేక పోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.
యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలో 6.0 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. జలాలాబాద్‌కు ఈశాన్యంగా 27 కి.మీ (16.77 మైళ్ళు) దూరంలో, నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని 8 కి.మీ (4.97 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని USGS తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:47 గంటలకు ఈ భూకంపం సంభవించింది.