అధ్యక్షుడ్ని, ప్రభుత్వ సంస్థలను రద్దు చేస్తున్నట్టు ప్రకటన
కొటోనౌ (బెనిన్) : పశ్చిమ ఆఫ్రికా దేశం బెనిన్‌లో సైనిక తిరుగుబాటు సంభవించింది. అధ్యక్షుడు ప్యాట్రిస్ టాలోన్, అన్ని ప్రభుత్వ సంస్థలను తొలగిస్తున్నట్టు సైన్యం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ టీవీ ఛానెల్‌లో ఆదివారం ప్రకటించింది. లెఫ్టినెంట్ కల్నల్ పాస్కల్ టిగ్రిని సైనిక కమిటీ అధ్యక్షుడిగా నియమితులైనట్టు తెలిపింది. 1960లో బెనిన్ ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొంది. ఈ స్వాతంత్య్రం పొందిన తొలి దశాబ్దాల్లో అనేక సైనిక తిరుగుబాట్లను చవిచూసింది. అయితే 1991లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బెనిన్‌గా పేరు మార్చుకున్న తరువాత దేశంలో రాజకీయంగా స్థిరంగా ఉంది. ప్రస్తుత అధ్యక్షులు టాలోన్ 2016 నుంచి అధికారంలో ఉన్నారు. వచ్చే ఏప్రిల్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల వరకూ ఆయన పదవిలో కొనసాగనున్నారు. గత నెలలోనే అధ్యక్షుడి పదవీ కాలాన్ని ఐదు నుంచి ఏడు ఏండ్లకు చట్టసభ పొడిగించింది. అలాగే ఒక వ్యక్తి రెండు సార్లు కంటే ఎక్కువసార్లు అధ్యక్ష పదవీలో ఉండకుండా నిరోధించింది. కాగా, గతవారమే మరో పశ్చిమ ఆఫ్రికా దేశం గినియా-బిస్సావులోనూ సైనిక తిరు గుబాటు జరిగింది. అధ్యక్షుడు ఉమారో ఎంబాలోను పదవీచ్యుతుడ్ని చేసింది.
బెనిన్‌లో సైనిక తిరుగుబాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



