Thursday, October 9, 2025
E-PAPER
Homeజిల్లాలుముర్రుపాలు తప్పనిసరిగా ఇవ్వాలి 

ముర్రుపాలు తప్పనిసరిగా ఇవ్వాలి 

- Advertisement -

నవతెలంగాణ – మోర్తాడ్ 
పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా తల్లులు ముర్రుపాలు తాగించాలని ఐసిడిఎస్ సిడిపిఓ స్వర్ణలత అన్నారు. గురువారం దొనకల్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో 8వ పోషణ మాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలు బాలింతలు కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ సెంటర్లలో ఇస్తున్న పోషక పదార్థాలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని , పిల్లలకు ముర్రుపాలు తాగించడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు తాగించడం వలన పిల్లలు తాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ శుభ్రత పరిశుభ్రత పై పిల్లలకు  ఆహారం తీసుకునే సమయంలో సూచించాలని తెలిపారు. పోషణ మాసం సందర్భంగా నిర్వహించిన క్రీడ పోటీలను నిర్వహించి బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎసిడిఓ జ్ఞానేశ్వరి, హెల్త్ సూపర్వైజర్ మారుతి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -