Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాడీ ఫ్రీజర్ కోసం మిల్లర్స్ రూ.25 లక్షలు విరాళం

బాడీ ఫ్రీజర్ కోసం మిల్లర్స్ రూ.25 లక్షలు విరాళం

- Advertisement -

మంత్రులకు చెక్కు అందజేత
నవతెలంగాణ – మిర్యాలగూడ 

చనిపోయిన మృతుదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన బాడీ ఫ్రిజర్ల కోసం మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున రూ.25 లక్షల ఆర్ధిక సహాయం చెక్కును సోమవారం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ కుందూరు రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లకు అందజేశారు. ఈ నిధులతో నాలుగు ఫ్రిజర్ల ను  కొనుగోలు చేసి ఏరియా ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ కోరారు. పేదల మృత దేహాలను భద్రపర్చేందుకు ఈ ఫ్రీజర్ లు ఉపయోగ పడుతాయని, మిల్లర్లు తమ వంతుగా సహాయం అందించారని తెలిపారు. ఆర్ధిక సహాయం అందించిన మిల్లర్స్ కు మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్  కార్యదర్శి వెంకట రమణ చౌదరి, ఉపాధ్యక్షులు గోళ్ళ రామ శేఖర్, కార్యదర్శి2 పోలిశెట్టి ధనంజయ కోశాధికారి గందె రాము తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -