- Advertisement -
- – నిరుపేద కుటుంబానికి చెందిన ఆదర్శ్ వైద్యానికి సాయం అందించిన మంత్రి
- – మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు అందించిన సహాయానికి కృతజ్ఞతలు ఆదర్శ తల్లి శ్వేత
- నవతెలంగాణ – హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం రెజిచింతల లోని నిరుపేద కుటుంబానికి చెందిన శ్వేత తన కుమారుడు ఆదర్శ్ అనారోగ్యం తో పటాన్ చెరువులోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స కోసం అడ్మిట్ చేసింది. తన కుమారుడు ఆదర్శ్ చికిత్స కు డబ్బులు లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి లో ఉండగా, అదే ఆసుపత్రిలో పాశ మైలారం లోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాద ఘటన లో గాయపడిన క్షతగాత్రులను పరమర్శించటానికి వచ్చిన మంత్రి దామోదర్ రాజనర్సింహ గారిని కలసి తన ఆవేదన, దయనీయ గాథ ను వెల్లడించింది.
- శ్వేత కుమారుడు ఆదర్శ్ పరిస్థితి నీ మంత్రి డాక్టర్ల ను అడిగి తెలుసుకున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ వెంటనే చలించి ఆదర్శ్ చికిత్సకు అవసరమైన డబ్బులు తన స్వయంగా చెల్లిస్తానని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశారు.
- గత కొన్ని రోజులుగా ఎంతో మంది ని కలిసి తన కుమారుడి చికిత్సకు సాయం చేయమని విజ్ఞప్తి చేసిన ఎవరు పట్టించుకోలేదని శ్వేత ఆవేదన చెందింది . మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు చూపిన మానవత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.
- Advertisement -