Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏకగ్రీవ గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ ను సన్మానించిన మంత్రి

ఏకగ్రీవ గ్రామ సర్పంచ్ ఉపసర్పంచ్ ను సన్మానించిన మంత్రి

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ మండలంలోని వంగ రామయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన భూక్య రాజేశ్వరి తిరుపతి, ఉప సర్పంచ్ దుండుగుల రాజు వార్డు మెంబర్ లను  బుధవారం మంత్రి కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సన్మానించారు. ఏకగ్రీవంగా సర్పంచ్ , ఉపసర్పంచ్ ను ఎన్నుకున్నందుకు ఆ గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయనతో పాటు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బందేల హరీష్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -